నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న 107వ చిత్రం ఫస్ట్ హంట్ ఆయన బర్త్ డే కానుకగా జనం ముందు నిలచింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం టీజర్ లో బాలయ్యకు సంబంధించిన పలు సెంటిమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ‘సింహ’ అనే పదం బాలకృష్ణకు భలేగా అచ్చివస్తోంది. పైగా ఆయన నరసింహస్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆ సెంటిమెంట్ తోనే ఈ ఫస్ట్ హంట్ లోనే శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనమిస్తారు. ఇక ఎమోషనల్…