Bhadrachalam: గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో భద్రాచలంలో 1వ హెచ్చరిక అమల్లోకి వచ్చింది. ఉదయం 08.15 గంటలకు నీటి మట్టం 43.00 అడుగులకు చేరి ప్రవాహం 9,32,288 క్యూసెక్కుల వద్ద నమోదయిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసి జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల ప్రాణరక్షణలో ఎలాంటి లోటు…
కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరదతో విజయవాడకు ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద తరలివస్తోంది. దీంతో.. మరోసారి ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉదృతి నెలకొంది. బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 3,27,692 క్యూసెక్కులు కాగా.. కాలువలకు 14,692 క్యూసెక్కుల వరదనీరు తరలించారు. బ్యారేజ్ లెవల్ 12.0 కు చేరింది. 20 గేట్లను 8 అడుగుల మేర, 50 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.…
ఓ వైపు గోదావరి.. మరో వైపు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతున్నాయి.. ఇప్పటికే కృష్ణాబేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జున సాగార్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పెద్ద ఎత్తున వరద నీరు దిగువకు వెళ్తుందో.. దీంతో క్రమంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద పెరుగుతూ పోతోంది.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు వరద తాకిడి పెరిగింది.. అప్రమత్తమైన అధికారులు.. దిగువ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. ఇన్‌ఫ్లో రూపంలో…