డ్రైవర్ లేకుండానే వాహనాలు నడిపే విషయంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ముందడుగు వేసింది. ఇండియాలోనే మొదటిసారిగా డ్రైవర్ లేకుండా నడిచే కారు టెస్ట్ రన్‌ను ఐఐటీ హైదరాబాద్ నిర్వహించింది. ఇందుకోసం మలుపులు, స్పీడ్‌బ్రేకర్లు లేకుండా 2 కిలోమీటర్లు పొడవైన ట్రాక్ నిర్మించింది. కేంద్రమంత్రి జితేంద్రసింగ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించారు. డ్రైవర్ లేకుండా 2 కిలోమీటర్ల పాటు ఈ కారును నడిపించి పరీక్షించారు. ఇటువంటి ప్రయోగం దేశంలోనే మొదటిది.…