రాష్ట్రంలో తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి రానుంది. తొలిసారిగా మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌ను కంటెయినర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి ఆనసూయ సీతక్క మంగళవారం నాడు ప్రారంభించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది. ప్రస్తుతం గుడిసెలో నడుస్తున్న పాఠశాల శిధిలావస్తకు చేరుకుంది. అటవి ప్రాంతం కావడంతో కొత్త పాఠశాల…