గత వారం ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల సంఘటన అమెరికాను ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే! దీని నుంచి ఆ అగ్రరాజ్యం ఇంకా కోలుకోకముందే.. మరిన్ని కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక్లహామాలోని తుల్సా ఆసుపత్రిలో ఒక దుండగుడు తుపాకీతో చెలరేగిపోయాడు. కాల్పులు జరిపిన వ్యక్తి, ఆ ఆసుపత్రికి ఓ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఫిలిప్ కోసం వచ్చాడు. ఆయన కనిపించకపోయేసరికి, ఆ వ్యక్తి సహనం కోల్పోయి ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే తనతో తెచ్చుకున్న తుపాకీతో…