హైదరాబాద్ అగ్ని ప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటన వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానన్నారు. ఈ విషాద ఘటన హృదయవిదారకంగా ఉందని.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు.