హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లి వినాయకనగర్ బస్తీలోని పరుపుల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మంటలను చూసిన స్థానికులు అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశారు.