Hyderabad Fire Accident Today: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జియాగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లోని ఓ ఫర్నిచర్ తయారీ గోదాంలో బుధవారం తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. భవనంలోని మూడో అంతస్తులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. భవనం పరిసర ప్రాంతంలో భారీగా మంటలు, పొగ అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రంగంలోకి దిగారు. పది ఫైర్ ఇంజిన్ల సాయంతో…