Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురి పరిస్థితి విషమం!
- హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
- రంగంలోకి పది ఫైర్ ఇంజన్స్
- పలువురి పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Fire Accident Today: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జియాగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లోని ఓ ఫర్నిచర్ తయారీ గోదాంలో బుధవారం తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. భవనంలోని మూడో అంతస్తులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. భవనం పరిసర ప్రాంతంలో భారీగా మంటలు, పొగ అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రంగంలోకి దిగారు. పది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఫర్నిచర్ తయారీ గోదాంలో 20 మంది ఉన్నారు. భారీ మంటలు, దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక బాగా ఇబ్బందిపడ్డారు. అధికారులు నిచ్చెన ద్వారా వారిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. 20 మందిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Vaibhav Sooryavanshi: "ఇది నిరంకుశత్వం".. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
Also Read: Budget 2024: క్రీడారంగానికి రూ.3,442 కోట్లు.. ‘ఖేలో ఇండియా’కు అత్యధిక నిధులు!
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫర్నిచర్ తయారీ గోదాంలో మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి వేళ అంతమంది గోదాంలో ఎందుకు ఉన్నారు?, వారంతా పని చేసేవారేనా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!