ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసి విమానాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సౌకర్యాలు ఎంత బాగుండాలి. అలాంటిది ఫ్లైట్‌లో వడ్డించిన ఆహారంలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో ఎయిరిండియా విమానంలో తీవ్ర కలకలం రేగింది. ప్రయాణికుడు భారత విమానాయాన శాఖకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా అందుకు సంబంధించిన చిత్రాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.