RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యాధునిక సాంకేతికతను వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులను, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ల(ఎన్‌బీఎఫ్‌సీల)ను మరింత సమర్థవంతంగా నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. భారీగా ఉండే డేటాబేస్‌ను విశ్లేషించేందుకు కూడా ఇవి అవసరమని భావిస్తోంది. ఇందులో భాగంగా అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్‌లను వాడనుంది.
Akasa Air Pilot’s Salaries: మన దేశ విమానయాన రంగంలోకి కొత్తగా ప్రవేశించిన ఆకాశ ఎయిర్ సంస్థ.. పైలట్ల శాలరీలను భారీగా పెంచటంలో ముందంజలో నిలుస్తోంది. తాజాగా సగటున 60 శాతం హైక్ చేసింది. వైమానిక సేవలను మరింతగా విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 2 లక్షల 79 వేలు మాత్రమే ఉన్న కెప్టెన్ల స్టార్టింగ్ శాలరీ నాలుగున్నర లక్షలకు చేరింది. ఫస్ట్ ఆఫీసర్ల వేతనం లక్షా 11 వేల నుంచి…