తెలంగాణ రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు గాను మరో 313 పోస్టులు మంజూరయ్యాయి.
Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని ఆర్ధిక శాఖ పేర్కొంది. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వేతనాలు తీసుకుంటున్న స్థానిక సంస్థలు, రాష్ట్ర సచివాలయం, శాసన పరిషత్ ఉద్యోగులు అధికారులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. న్యాయాధికారులు, గ్రామ అధికారులు మినహా 309 అధికరణ…
తెలంగాణ హైకోర్టులో వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో 779 అదనపు పోస్టులకు మంజూరు ఇస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరైన పోస్టుల్లో రిజిస్ట్రార్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) 1, జాయింట్ రిజిస్ట్రార్ 3, డిప్యూటీ రిజిస్ట్రార్ 5, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 4, సెక్షన్ ఆఫీసర్స్/స్క్రూటినీ ఆఫీసర్స్ 96, కోర్టు మాస్టర్స్/పీఎస్ టు జడ్జెస్ 59, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్స్/ట్రాన్స్‌లేటర్ 78, కంప్యూటర్ ఆపరేటర్ 12,…