తెలుగు ఫిలిం జర్నలిస్ట్ సంఘాలతో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తాజాగా సమావేశం అయ్యారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, అలాగే కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ ప్రసన్న కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ఫేక్ థంబ్‌నెయిల్స్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కావడం వంటి అంశాలపై చర్చించారు.…