ఈ రోజుల్లో వినోద పరిశ్రమలో ప్రతిభ, కృషి, అనుభవం కంటే ఎక్కువ ప్రాముఖ్యత పొందుతున్నది సోషల్ మీడియా ఫాలోయింగ్. ఇప్పుడు నటన కంటే “ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు?” అనే ప్రశ్నే ఎక్కువ ప్రాధాన్యం పొందుతోంది. నటీమణులు తమ ప్రతిభను చూపించే వేదికగా కాకుండా, సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత జీవితాన్ని, స్టైల్‌ని ప్రదర్శిస్తూ గుర్తింపు పొందుతున్నారు. ఈ కొత్త పరిస్థితిపై ప్రముఖ నటి సంధ్య మృదుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. Also Read…