Sandhya Mridul: ఫాలోవర్స్ లేని నటీనటులకి ఇండస్ట్రీలో పనిలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో వినోద పరిశ్రమలో ప్రతిభ, కృషి, అనుభవం కంటే ఎక్కువ ప్రాముఖ్యత పొందుతున్నది సోషల్ మీడియా ఫాలోయింగ్. ఇప్పుడు నటన కంటే “ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు?” అనే ప్రశ్నే ఎక్కువ ప్రాధాన్యం పొందుతోంది. నటీమణులు తమ ప్రతిభను చూపించే వేదికగా కాకుండా, సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత జీవితాన్ని, స్టైల్‌ని ప్రదర్శిస్తూ గుర్తింపు పొందుతున్నారు. ఈ కొత్త పరిస్థితిపై ప్రముఖ నటి సంధ్య మృదుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read : Samantha : నా గతాన్ని తలుచుకుంటే నాకే నవ్వొస్తుంది..
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన 'సీక్రెట్ సోల్జర్'
తాజా ఇంటర్వ్యూలో సంధ్య మాట్లాడుతూ.. “ఇప్పటి పరిస్థితుల్లో నటన కంటే ఫాలోవర్లే ముఖ్యం అయ్యాయి. నేను సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా లేను, అందుకే నాకు ఛాన్స్‌లు రావడం లేదు. కానీ నాకు ఫాలోవర్స్ పెరగాలంటే ముందుగా పనివ్వాలి కదా? పని లేకుండా నేను ఎలా ఫేమస్ అవుతాను? ఫేమస్ కాకపోతే ఫాలోవర్స్ ఎలా పెరుగుతారు? ఇది సరైన వ్యవస్థనా? సోషల్ మీడియా ఆధారంగా అవకాశాలు ఇవ్వడం ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పుడు కళ్లతో భావాలు చెప్పే నటనకు అవసరం లేదు, సోషల్ మీడియాలో కాస్త గ్లామర్ షో చేస్తే చాలు – అవకాశాలు వస్తున్నాయి. ఇది కళాకారుల పట్ల అన్యాయం” అని సంధ్య చెప్పింది.
సంధ్యా మృదుల్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక అభిమాని ఇలా స్పందించాడు “ఇది నిజమే. ఇప్పుడు ప్రతిభ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియా ఇమేజ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.” మరొకరు వ్యాఖ్యానిస్తూ “ప్రేక్షకులే ఇప్పుడు కళాకారులను ఫాలోవర్ల సంఖ్యతో కొలుస్తున్నారు. ఇది కళకు అవమానం.” అని పేర్కొన్నారు. ఇంకొకరు “ఇది నిజం కానీ, ప్రస్తుతం ఇది తప్పించలేని వాస్తవం” అని కామెంట్స్ చేస్తున్నారు. అంటే తన సినీ అనుభవం, ప్రతిభ ఉన్నప్పటికీ సోషల్ మీడియా ఫాలోవర్ల కొరత కారణంగా అవకాశాలు దొరకకపోవడం సంధ్యకు బాధ కలిగిస్తోంది. ఆమె మాటల్లో “ప్రతిభను పక్కనపెట్టి ఫాలోవర్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఇండస్ట్రీకి నష్టం. కళను ప్రేమించే వారికి ఇది నిరాశ కలిగించే పరిస్థితి” అని చెప్పింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!