గత సెప్టెంబర్‌లో ఇంటర్‌కాంటినెంటల్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్.. మరో అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. సోమవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి మైదానంలో భారత్, మలేసియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఏర్పాట్లను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఇప్పటికే పూర్తిచేసింది. తొలిసారి హైదరాబాద్ వేదికగా ఫిఫా మ్యాచ్ జరుగుతుండడంతో ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. రాత్రి 7:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష…