Proddatur Dussehra : దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకునే ప్రాంతాల్లో ప్రొద్దుటూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీ ఏటా ఇక్కడ జరిగే దసరా వేడుకలు కళాత్మకంగా, భక్తి శ్రద్ధలతో నిండిపోయి తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తుంటాయి. ఈ అపూర్వ ఉత్సవాన్ని మరింత మందికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ మురళీ కృష్ణ తుమ్మ తెరకెక్కించిన “ప్రొద్దుటూరు దసరా” డాక్యుమెంటరీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌పై, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ఈ డాక్యుమెంటరీని నిర్మాత…
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రజలు రంగుల్లో మునిగితేలుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుని ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. స్నేహితులు, సన్నిహితులు పాటలకు స్టెప్స్ వేస్తూ సందడి చేస్తున్నారు. అందరూ ఒక చోట చేరి కలర్ ఫుల్ రంగులను చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి రంగులు పూసుకుంటూ.. డ్యాన్సులు వేస్తూ... హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రెయిన్ డ్యాన్సులు, మడ్ డ్యాన్సులు లాంటి వెరిటీ ప్రోగ్రామ్ లతో…