ఈక్వెడార్ అధ్యక్ష అభ్యర్థి ఫెర్నాండో విలావిసెన్సియో హత్యకు గురైన నేపథ్యంలో గురువారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదే సమయంలో హత్యపై దర్యాప్తులో సహాయం చేయాలని ఎఫ్‌బిఐని కోరారు. 59 ఏళ్ల జర్నలిస్ట్, అవినీతి వ్యతిరేక క్రూసేడర్ ఫెర్నాండో విలావిసెన్సియో హత్యకు సంబంధించి ఆరుగురు కొలంబియన్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.