వయసులో కలిగే కోర్కెలకు కళ్లెం వేసుకోకపోతే లేనిపోని అనర్థాలు జరుగుతాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. హైస్కూల్ వయసులోనో.. లేదంటే కాలేజీ వయసులోనో సహజంగా రకరకాలైన ఆలోచనలు పడుతుంటాయి. వాటిని అనుచుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. లేదంటే కార్యరూపం దాలిస్తే.. లోనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
స్కూల్ చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా పిల్లలకు, జీవితంలో అత్యుత్తమ పునాది పాఠశాలలో వేయబడుతుంది. అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి బడిలో చదివించాలని కష్టపడుతున్నారు.. డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడరు. కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలతో పాటు జీవితం గురించి కూడా బోధిస్తారు. అన్ని రంగాల్లో రాణించగలమన్న సత్తాను చాటుతున్నారు... ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోనూ మంచి విద్యనభ్యసిస్తున్నారనే నమ్మకం ఉంది..
విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన ఓ ఉపాధ్యాయురాలు దాదాపు 25 ఏళ్లుగా ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. తన జీవితంలో వేలాదిమందికి విద్యాబుద్ధులు నేర్పారు. కానీ ఐదేళ్ల క్రితం ఏమైందో ఏమో..