తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫీజు గడువు తేదీలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. అయితే, ఇవాళ్టి నుంచి అనగా ( అక్టోబర్ 26)వ తేదీ నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ స్టార్ట్ అయి.. నవంబర్ 14వ తేదీ వరకు ఎలాంటి జరిమానా లేకుండా విద్యార్థులు ఫీజును చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు వెల్లడించింది.