Doctors Protest: పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్యకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు గత 65 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. వారికి మద్దతుగా నేటి (అక్టోబర్ 14) నుంచి ఎలక్టివ్ సర్వీసులను బహిష్కరించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఆదివారం దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు, రెసిడెంట్ డాక్టర్లను కోరింది.