AP Assembly: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలు అవుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఓటాన్ అకౌండ్ బడ్జెట్ ను గత ఏడాది జూలైలో చంద్రబాబు సర్కార్ ప్రవేశ పెట్టింది. ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరం 2025 - 26కి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అసెంబ్లీ సమావేశాల గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.