సాధారణంగా అంత్యక్రియలను కూతుళ్లు నిర్వహించినా.. పాడె మోయడం, తలకొరివి పెట్టడం లాంటివి మాత్రం కూమారులే నిర్వహిస్తుంటారు.. అయితే, కుమారులు లేనివారి కూడా వారి దగ్గర బంధువులతో ఆ కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు.. కొన్ని సందర్భాల్లో అయితే.. కూతుళ్లే అన్ని నిర్వహించిన సందర్భాలున్నాయి.. తాజాగా, ఓ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది.. కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో తండ్రి పాడె మోసి అంత్యక్రియలు నిర్వహించారు కూతుళ్లు.. Read Also: Daughter Killed Mother: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రేమ మాయలో పడి…
శ్రీకాకుళం, ఆమదాలవలస (మం) బొబ్బిలిపేటలో బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. కర్ఫ్యూ కారణంగా తండ్రి అంతిమ చూపుకు నోచుకోలేదు ఓ కొడుకు. కరోనాతో ఆవాల అప్పయ్య (70) అనే వృద్ధుడు మృతి చెందాడు. అయితే ఉపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నారు మృతుడి కొడుకు, ఇద్దరు కుమార్తెలు. కానీ కర్ఫ్యూ కారణంగా ఊరికి రాలేకపోతున్నామంటూ బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పయ్య మృతదేహాన్ని ముట్టుకునేందుకు స్థానికులు సాహసించలేదు. దాంతో రెడ్ క్రాస్ సొసైటీకి సమాచారం అందించారు సచివాలయ సిబ్బంది.…