వారం రోజుల క్రితమే పెళ్ళయింది. పెళ్ళి కూతురు కాళ్ళ పారాణి కూడా ఆరలేదు. కానీ విధి రూపంలో వచ్చిన ఆర్టీసీ బస్ కొత్త పెళ్ళికొడుకు ప్రాణాలను బలిగొంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వద్ద దేవరకొండ డిపో ఆర్టీసి బస్సు, ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో వికారాబాద్ వన్ టౌన్ ఎస్ఐ శ్రీను నాయక్(32) ఆయన తండ్రి మాన్య నాయక్(50) అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండా వాసులుగా…
హీరో డా.రాజశేఖర్‌కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్ (93) గురువారం సాయంత్రం సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరదరాజన్ గోపాల్ చెన్పై డీసీపీగా రిటైర్ అయ్యారు. ఆయనకు అయిదగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. హీరో రాజశేఖర్, వరదరాజన్ గోపాల్‌కు రెండో సంతానం. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్ గోపాల్ భౌతికకాయాన్ని ఫ్లైట్‌లో చెన్నైకు…