ఈరోజు, ఆగస్టు 15న, అంటే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలలో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి FASTag వార్షిక పాస్ ను తీసుకొచ్చారు. హైవే యాత్ర యాప్‌లో అధికారిక బుకింగ్ జరుగుతోంది. ఈ వార్షిక పాస్ కేవలం రూ. 3,000 ఖర్చుతో ఎంపిక చేసిన రోడ్లపై ఏడాది పొడవునా టోల్-ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని ప్రజలకు అందిస్తుంది. 1 సంవత్సరానికి 200 ట్రిప్ పరిమితితో…