ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూశారు. 63 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. రోహిత్ బాల్ మృతికి ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంతాపం తెలిపింది. పురుషులు, మహిళలకు ఆయన అందించిన డిజైన్లు బాగా ప్రసిద్ధి చెందాయి. 1986లో ఆర్చిడ్ ఓవర్సీ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించి తన వృత్తిని ప్రారంభించారు.