తెలంగాణలో అమలవుతున్న రైతు అనుకూల విధానాల పట్ల ఆకర్షితులై దక్షిణ భారత రైతు సంఘాల నాయకులు తమ తమ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా ఒత్తిడి తేవాలని తీర్మానించారు. అలాంటి తొలి ప్రయత్నంగా శనివారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి రైతు సంఘాల నేతలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా వినతిపత్రం సమర్పించారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేయడంతోపాటు వ్యవసాయ…