కామారెడ్డి జిల్లాలోని మైదాన ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను, రైతుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అటవీ ప్రాంతాల నుంచి మైదానంలోకి వచ్చిన ఈ పెద్దపులి కారణంగా సమీప మండలాల్లో అలజడి నెలకొంది. భిక్కనూరు మండలం, పెద్దమల్లారెడ్డి ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీ అధికారులు ధృవీకరించారు. దీనితో పాటు, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట మండలాల పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పెద్దపులి తన ఉనికిని చాటుతూ కేవలం 24 గంటల వ్యవధిలోనే మూడు లేగదూడలపై…
ఏపీలో ఒకవైపు ఏనుగులు, మరోవైపు పులులు సంచారంతో జనం హడలిపోతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులి సంచారం జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సీసీ కెమెరాలో పులి కదలికలను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సీసీ కెమెరాలు అమర్చి పులి జాడను గుర్తించారు అధికారులు. పులిని పట్టుకునేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులిని పట్టుకునే పనిలో 120 మంది అటవీ సిబ్బందిని వినియోగిస్తున్నారు. గత పది రోజులుగా ఒమ్మంగి, పోతులూరు, శరభవరం…
చిత్తూరు జిల్లాలో గజరాజులు బీభత్సం కలిగిస్తున్నాయి. రేణిగుంటలో ఏనుగుల బీభత్సంతో జనం హడలిపోతున్నారు. మొలగముడి గ్రామంలో 3 ఏనుగులు సంచారంతో రైతులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. పంట పొలాలపై వీరంగం సృష్టిస్తున్నాయి. చెరకు పంట నాశనం చేశాయి గుంపులుగా వచ్చిన ఏనుగులు. దీంతో భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. రాత్రి సమయాల్లో రైతులు పంటలకు కాపలా వుంటుంటారు. అయితే ఏనుగులు ఏ వైపు నుంచి వచ్చి తమపై దాడిచేస్తాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అన్నదాతలు, రైతులు ఆరుగాలం…