డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం విచారణ వేగవంతం చేసింది. సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో నాగేంద్ర అనే రైతు అప్పుల బాధ తాళలేక తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు.