కామారెడ్డిలో టెన్షన్ మళ్ళీ మొదలైంది. నేడు హై కోర్టులో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై మరో సారి విచారణ జరగనుంది. ప్రభుత్వం కౌంటర్ కు సమయం కోరడంతో విచారణ నేటికి వాయిదా పడ్డ విషయం తెలిసిందే.. తమను సంప్రదించకుండా పంట భూములను రిక్రియషన్ జోన్ గా ప్రతిపాదించడాన్ని సవాలు చేస్తూ రామేశ్వర్ పల్లి రైతులు హైకోర్టు మెట్లు ఎక్కారు.
కామారెడ్డి జిల్లాలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం ముగిసింది. ముందుగా.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతు రాములు మృతికి రైతు జే.ఏ.సి. సంతాపం ప్రకటించారు. రాములు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.