Viral Video: అయోధ్య జైలు నుంచి విడుదల అయిన 98 ఏళ్ల వృద్ధుడికి ఘనంగా వీడ్కోలు చెప్పారు జైలు సిబ్బంది. ఇతరులతో గొడవ పడిన కారణంగా ఐపీసీ 452, 323, 352 సెక్షన్ల కింద 98 ఏళ్ల రామ్ సూరత్ అనే వ్యక్తికి జైలు శిక్ష విధించారు. ఐదేళ్ల పాటు ఆయన జైలులో శిక్ష అనుభవించారు. తాజాగా విడుదల అయ్యారు.