కరోనా వల్ల చితికిపోయిన నేతన్నలు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ తిరిగి పనుల్లో కుదురుకుంటున్నారు. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా… వీరికి విద్యుత్ ఛార్జీలు పెంపు గుదిబండగా మారాయి. పరిస్థితి ఇలానే ఉంటే రైతుల్లానే మేము కూడా ఆత్మహత్య చేసుకోవాలంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు నేత కార్మికులు. పరిశ్రమల కేటగిరీలోకి మార్చి అదనపు బిల్లులు వస్తూలు చేస్తుండటంతో.. నేత కార్మికుల విద్యుత్ ఛార్జీలు రెండు రెట్లు పెరిగాయి. ఈడీ ఛార్జీల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తుండటంతో నష్టపోతున్నామని…