Fake Doctorate Scam: డాక్టరేట్ కావాలా..? పదో తరగతి ఫెయిల్ ఐనా పర్వాలేదు.. డబ్బులిస్తే చాలు !! సమాజంలో మీకంటూ గుర్తింపు కావాలని ఆశపడుతున్నారా ? ఇంకెందుకు ఆలస్యం.. అడిగినంత ఇచ్చేయండి.. డాక్టరేట్ పొందేయండి !! ప్రతిష్టాత్మక డాక్టరేట్లను అంగట్లో సరుకులా అమ్ముతున్నాడు ఓ మేధావి. డాక్టరేట్...!! పేరుకు ముందు ఈ పదం జోడించుకోవాలి అంటే ఎంతో ఘనత సాధించి ఉండాలి.