అవకాశం చిక్కితే అడ్డంగా దోచేందుకు కొందరు కేటుగాళ్ళు రెడీ అయిపోతున్నారు. వరంగల్ జిల్లాలో ఓ ముఠా నకిలీ ఇన్స్యూరెన్స్‌ల పేరిట భారీగా మోసాలకు పాల్పడింది. ఆర్టీఏ కార్యాలయంలో నకిలీ ఇన్స్యూరెన్సుల దందా వెలుగులోకి వచ్చింది. తీగ లాగిన పోలీసులు పలు అంశాలు వెలుగులోకి తెచ్చారు. ఆర్టీఏ కార్యాలయం పరిసర ప్రాంతాలలో దళారులుగా పనిచేస్తూ నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు తయారుచేశారు. మోసాలకు పాల్పడ్డారు. ఈ దందాలో ప్రమేయం వున్న 10 మందిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు.…