హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్శిటీలో ఆకతాయిల అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. అక్కడ విద్యార్థులు ఉంటారు.. చదువుకుంటారు అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. పైగా అలాంటి వారిని ప్రశ్నిస్తే.. అచ్చోసిన ఆంబోతుల్లా మీద పడి క్యాంపస్ విద్యార్థుల పైనే దాడి చేస్తున్నారు. అలాంటి ఓ ఘటనలో పోలీసులు నలుగురు అకతాయిలను అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ.. విద్యార్థులపాలిట దేవాలయం. అక్కడ చదువుకోవాలని.. ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో సీట్ కోసం ఎంతో మంది విద్యార్థులు తపస్సు చేస్తుంటారు.…