తేరగా డబ్బులు సంపాదించే వారు ఓ వైపు.. దురాశతో సంపాదిద్దామనుకునే వారు మరోవైపు.. వీరిద్దరి మధ్య బంధం ఫెవికాల్ కంటే గట్టిగానే ఏర్పడుతుంది. కానీ చివరకు అందులో నుంచి మోసం వెలుగులోకి వస్తుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంలలో సరిగ్గా ఇలాగే జరిగింది. బంగారు నాణేల పేరుతో ఓ వ్యాపారిని కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. 20 లక్షల రూపాయలు కొట్టేశారు. చివరికి పోలీసులకు చిక్కారు. చివ్వెంల మండలం తుమ్మలపెంపహాడ్‌కు చెందిన పసుపుల గణేష్, ఓర్సు చంటి, మద్దంగుల వెంకన్న,…