విజయవాడ రైల్వేస్టేషన్‌కి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని.. పాకిస్థాన్‌కు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి పేరుతో ఫోన్ చేశారని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజి తెలిపారు. "స్టేషనులో బాంబు పెట్టాం అని కాల్ చేసిన హుస్సేన్ చెప్పాడు.. ఫోన్ ట్రాక్ చేస్తే ఆర్ఆర్ పేట రైల్వే లైను వద్ద సిగ్నల్ వచ్చింది. కాల్ వచ్చినపుడు ముంబై నుంచీ విశాఖ వెళ్ళే రైలు వెళ్ళింది.. ఆ రైలును కూడా పూర్యిగా తనిఖీ చేశాం..
ఓ మందుబాబు చేసిన తుంటరి పనికి దుబాయ్ వెళ్లాల్సిన విమానం ఆగింది. ఆగిపోవడమే కాకుండా ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులను కూడా ఉరుకులు పరుగులు పెట్టించాడు. ఇంతకీ అతను చేసిన పని ఏంటంటే.. శనివారం నాడు తన కుటుంబ సభ్యులను దేశం నుండి బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలనుకున్న ఓ తాగుబోతు.. దుబాయ్‌కి వెళ్లే ఓ ప్రైవేట్ క్యారియర్‌కు బూటకపు బాంబు బెదిరింపు చేసి పోలీసుల వలలో పడ్డాడు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు వచ్చిన వార్త కలకలం రేపుతోంది. విజయ్ ఇంట్లో బాంబ్ పెట్టినట్లు చెన్నై పోలీసులకు కాల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చెన్నైలోని విజయ్ ఇంటిని తనిఖీ చేశారు. అక్కడ ఎటువంటి బాంబు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఆకతాయి ఇలాంటి ఫేక్ ఫోన్ కాల్ చేసినట్లు అనుమానించిన పోలీసులు ఎట్టకేలకు ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని విళ్లుపురం జిల్లా మరక్కాణం గ్రామానికి…
తమిళ్ స్టార్ హీరో అజిత్ కు బాంబు బెదిరింపు రావడం కోలీవుడ్ లో కలకలం రేపింది. ఆయన ఇంటిలో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అజిత్ ఇంటికెళ్ళి జాగిలాలతో తనిఖీలు చేశారు. ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వినోద్ తో ‘వాలిమై’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో హుమా ఖురేషి…