మీరు చూస్తున్నది నిజమేనండి.. ఓ ఘరానా కేటుగాడు ఏకంగా నకిలీ బ్యాంకులనే ఏర్పాటు చేశాడు. ఉద్యోగులను నియమించుకుని బ్యాంకుకు ఏ మాత్రం తగ్గకుండా కార్యకలాపాలు చేపట్టాడు. ఖాతాలు తెరవడమే కాకుండా డిపాజిట్లు కూడా తీసుకున్నాడు. మొత్తం 9 బ్రాంచీలను తెరిచి దందా కొనసాగిస్తున్నాడు ఆ కేటుగాడు.