చర్మ సంరక్షణకు సంబంధించి అర్థంలేని ప్రచారాలు అనేకం. వాటిలో నిజమెంత, అసత్యాలెన్ని అన్నది తెలుసుకోవాల్సిందే. ఈ మధ్యకాలంలో ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ అనే పదాలు సౌందర్య ఉత్పత్తుల విషయంలో బాగా వినిపిస్తున్నాయి. నిజానికి రసాయనాలు లేకుండా ఏ సౌందర్య సాధనాన్నీ తయారు చేయలేరు. కానీ, ఆయా ఉత్పత్తుల మీద ఉన్న పేర్లను బట్టి ఏదేదో ఊహించుకుంటాం. చర్మానికి కొన్ని ఉత్పత్తులు రాసినప్పుడు కొంత మంట కలుగుతుంది. అందులోని ఆల్కహాల్ లేదా మెంథాల్ దీనికి కారణం. విపరీతమైన మంట…