ఫేస్‌బుక్ లైవ్ చేస్తూ మహిళా న్యాయవాది ఆత్మహత్య చేసుకున్న ఘటన లక్నోలో జరిగింది. ఆమె సివిల్ కోర్టు మూడో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకునడాన్ని చూసి లాయర్లు కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. ఆమె కోర్టు భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను బలరాంపూర్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.