బాసర ఆర్జీయూకేటీ ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగించారు. నేటితో(జూన్ 19) దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా.. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈనెల 22 వరకు దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ సతీష్‌కుమార్ తెలిపారు. దీంతో అర్హులైన మరికొందరు విద్యార్థులు 22 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రూప్-1 దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తు చేసుకునే గడువును జూన్ 4 వరకు పొడిగిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ మంగళవారం రాత్రి ప్రకటించింది. వాస్తవానికి మంగళవారం రాత్రితో గడువు ముగిసినప్పటికీ, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకొన్నది. ఫీజుల చెల్లింపు విషయంలో సమస్యలు తలెత్తినట్టు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎవరూ నష్టపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో గడువును పొడిగిస్తున్నట్టు టీఎస్‌పీఎస్పీ వర్గాలు తెలిపాయి. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు…