పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. 48 గంటల్లో ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అయితే మానవతా దృక్పథంతో వైద్య, దౌత్య మరియు దీర్ఘకాలిక వర్గాలకు కొంత మినహాయించింది. తాజాగా వారికి కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.