ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. మద్యం పాలసీ కేసులో ట్రయిల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడు ఆప్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం ఏప్రిల్ 17 వరకు పొడిగించింది ఏప్రిల్ 12న అతని బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగిచింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు సోమవారం ఏప్రిల్ 17 వరకు పొడిగించింది.