నిర్మల్ లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇవి వదంతులు మాత్రమే అని, అసత్య వార్తలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కడెం జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ పలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నవి అసత్యపు వార్తలని స్పష్టం చేశారు. అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని,…