Google Map: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి.. ఉదయం 9 గంటలకు ఎగ్జామ్ ప్రారంభించారు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని నిబంధన ఉండడంతో పరీక్షా కేంద్రాల నుంచి కొందరు విద్యార్థులు వెనుదిరగాల్సి వచ్చింది.. ముందే ఎగ్జామ్ సెంటర్ చూసుకోవాలి.. గంట ముందుగానే సెంటర్‌కు చేరుకోవాలని విద్యార్థులకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా.. విద్యార్థులు చేసిన చిన్న తప్పిదాలే.. వారిని ఎగ్జామ్‌కు దూరం చేస్తున్నాయి.. ఇక, ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థి…
ఏపీలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడూరులో పెనువిషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన సతీష్ అనే ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. గూడూరు డీఆర్‌డబ్ల్యూ పరీక్షా కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. అయితే పరీక్షా కేంద్రానికి వచ్చినప్పుడే గేటు వద్ద తనకు ఛాతిలో నొప్పిగా ఉందని అక్కడి సిబ్బందితో సతీష్ చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం పరీక్షా కేంద్రంలోని గది వద్దకు చేరుకోగా విద్యార్థి సతీష్ గుండెపోటు…