Danish Kaneria: పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ డానిష్ కనేరియా భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు మద్దతు తెలిపారు. 2015కి ముందు భారత్‌కి తరలివెళ్లిన శరణార్థులకు సంబంధించి, సీఏఏ నిబంధనలు పాకిస్తానీ హిందువులందరికీ మంచివని కనేరియా ప్రశంసించారు. పాకిస్తానీ హిందువులు ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకోగలుగుతారు అని కనేరియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సీఏఏని అమలు చేసినందుకు భారత ప్రధాని నరేంద్రమోడీకి, హోమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు.