2021 ఆగస్ట్ 21నుంచి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో మాదిరిగా కాకుండా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని, మహిళల హక్కులు కాపాడతామని స్పష్టం చేశారు. కానీ చెప్పింది ఒకటి చేస్తున్నది మరొకటిగా మారింది. మహిళలకు ఎలాంటి హానీ తలపెట్టబోమని చెబుతూనే వారిని హింసిస్తున్నారు. మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించి ఇంటికే పరిమితం చేశారు. అంతేకాదు, గతంలో మాజీ ప్రభుత్వ సభ్యులు, మాజీ భద్రతాదళ…