వాళ్లిద్దరి మాట వేరు.. బాట వేరు. మొన్నటి వరకు ఒకేపార్టీలో ఉన్నా.. ఎన్నికలకు ముందు వేర్వేరు పార్టీల్లో ఉండిపోయారు. ఇప్పుడు సడెన్‌గా వారిద్దరి మాట-బాట కలిసింది. అది అంతవరకే పరిమితం అవుతుందా? అంతకుమించి ఇంకేమైనా ఉంటుందా అనే ఆసక్తి మొదలైంది. ఇంతకీ ఎవరా నేతలు..? కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కలిపిందా? టీడీపీలో కీలక నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి…