ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని మరింత అప్పుల పాల్జేస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శులు గుప్పించారు. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా జిల్లాకో ఎయిర్ పోర్టు కడతాననడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. పోలవరం, ఉత్తరాంధ్రా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి ఏమిటీ తుగ్లక్…
రైతులు సాగు చేసుకున్న చెట్లను అమ్ముకునేందుకు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు… దీనిపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పునరాలోచించాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయి తడపందే రెవెన్యూ అధికారులను చెట్లను లెక్కించడం లేదన్నారు. అనుమతించేందుకు అటవీశాఖ అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. Read Also: తాచుపాములా కాటేస్తున్నాడు.. కేసీఆర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఢీఎఫ్‌ఓ వరకు…
చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ.. నిన్న విశాఖపట్నంలోని నర్సీపట్నం టీడీపీ నేత అయ్యపాత్రుడు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ధర్నా కాస్తా పోలీసుల ఎంట్రీతో రసభాసగా సాగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, చింతలపూడి విజయ్ సహా 16 మందిపై నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.…