తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది. మల్టీస్టారర్ చిత్రాలకు సక్సెస్ రేటు కూడా చాలా ఎక్కువ ఉంది.అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మరియు శోభన్ బాబు లాంటి హీరోలు చాలా సినిమాల్లో మల్టీ స్టారర్ హీరోలుగా కనిపించి మంచి విజయాలను కూడా అందుకున్నారు…ఆ కాలంలో మల్టీస్టారర్ చిత్రాలు బాగా వచ్చాయి. ఆ తర్వాత వాటి ట్రెండ్ కాస్త తగ్గినా.. ఇప్పుడు మళ్లీ కూడా ఊపందుకున్నాయి. ముఖ్యంగా `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`…
(జూన్ 10న ఇ.వి.వి. సత్యనారాయణ జయంతి)ఆరోగ్యంగా ఉండాలంటే అన్నీ మరచి, హాయిగా నవ్వాలి అంటున్నారు లాఫింగ్ థెరపిస్టులు. మనసు బాగోలేనప్పుడు కాసింత ఊరట చెందటానికే చాలామంది సినిమాలను ఆశ్రయించేవారు. అలాంటి వారికి వినోదాల విందు అందించాలన్న సత్సంకల్పంతోనే ‘విజయా’వారు సినిమాలు తీశారు. ‘విజయా’వారి చిత్రాల్లోని పాటల మకుటాలతోనే సినిమాలు తీసి అలరించారు దర్శకరచయిత జంధ్యాల. అలాంటి జంధ్యాల దగ్గర పనిచేసిన ఇ.వి.వి.సత్యనారాయణ కూడా గురువు బాటలోనే పయనిస్తూ పలు నవ్వుల నావలు తయారు చేసి, సంసారసాగరాన్ని ఈదుతున్న…